ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లాడియేటర్‌ 2 నుండి సరికొత్త అప్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2023, 04:47 PM



వరల్డ్‌ వైడ్‌గా మూవీ లవర్స్‌ ఎదురుచూస్తున్న చిత్రం ‘గ్లాడియేటర్‌ 2’. 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు ఆస్కార్‌ అవార్డులను దక్కించుకుంది. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల షూటింగ్‌ ఆలస్యమవుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ ప్రమాదంతో షూటింగ్‌ ఆలస్యం కావడం వల్ల సినిమా విడుదలలో జాప్యం జరుగుతుందేమో అని అభిమానులు నిరాశ పడుతున్నారు. రిడ్లీ స్కాట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  వచ్చే ఏడాది నవంబర్‌లో  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com