ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతిరధుల సమక్షంలో ఒక్కటైనా జంట

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 04:12 PM



బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా  వివాహం ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో  వైభవంగా జరిగింది. ఆదివారం రాజాస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో వివాహబంధం ఒకటయ్యారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలని కల్యాణ వేదిక కళకళలాడింది. 22న వధువరులు కుటుంబాలు ఉదయ్‌పుర్‌ చేరుకున్నాయి. అదే రోజు మెహందీ, సంగీత్‌ వేడుకలు జరిగాయి. అందులో భాగంగా 90ల థీమ్‌ సాంగ్స్‌తో సంగీత్‌ నైట్‌ పేరిట ఏర్పాటు చేసిన సంగీత్‌లో ప్రముఖ గాయకుడు నవరాజ్‌ హన్స్‌ పంజాబీ ట్యూన్‌లకు సీఎం భగవంత్‌ మాన్‌ కాలు కదిపారు. ఆదివారం సాయంత్రం 6.30గంటల సమయంలో రాఘవ్‌ చద్దా పరిణితి మెడలో మూడుముళ్లు వేశారు. రాత్రి 8.30గంటలకు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుకకు విచ్చేసిన అతిథుల కోసం ఆసియా, భారతీయ వంటకాలు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com