ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన పవన్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 23, 2017, 12:15 PM



యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  


ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా 28వది.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా పనులు ప్రారంభించనున్నాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com