తెలుగు,తమిళ. హిందీ భాషల్లో శృతి హాసన్ నటించి మెప్పించింది.. అయితే ఈ మధ్య లవ్ లో పడిన ఆమె కెరియర్ పై పెద్దగా దృష్టిపెట్టలేదు. దాంతో మూడు భాషల ప్రేక్షకుల ముందుకు ఆమె సినిమాలు రాలేదు. తాజాగా ఆమె లవ్ బ్రేకప్ అయింది.. మళ్లీ మూవీలపై దృష్టి సారించింది.. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, నేను లవ్ లో వున్నప్పుడు ఎవరికి తోచింది వాళ్లు రాశారు. అలాగే అనారోగ్య కారణం వలన కాస్త లావైనప్పుడు కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగానే అవి నన్ను చాలా బాధించాయి. ఇకపై ట్రోలింగ్ ను గానీ .. కామెంట్స్ ను గాని పట్టించుకోవద్దని నేను నిర్ణయించుకున్నాను. ఎవరేమైనా అనుకోని, కెరియర్ పై దృష్టిపెట్టి నా పనిని నేను చేసుకుపోవాలని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.