నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ ‘గ్యాంగ్ లీడర్. విక్రమ్ కె కుమార్ ఈ మూవీకి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నా ఈ సినిమా ఫస్టులుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. నానితో పాటు ఆయన గ్యాంగ్ ను పోస్టర్ ను చూపారు. నానీ గ్యాంగ్ లో బామ్మ .. వరలక్ష్మి .. ప్రియా .. స్వాతి .. చిన్నూ సభ్యులుగా వున్న విషయాన్ని రివీల్ చేశారు. వీళ్లంతా కూడా బైనాక్యులర్స్ తో ఎవరినో రహస్యంగా గమనిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీ తొలి సాంగ్ ను ఈ నెల 18, 24వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నారు.