ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ కోసం విదేశీ భామ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 11:36 AM



ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ఈ ముగ్గురి కలయికలో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇప్పటికే ఈ సినిమాకు నేపథ్యం ఏమిటనేది దర్శకుడు వెల్లడించారు. ఇద్దరు యోధుల కథతో తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్‌, కొమరం భీమ్‌ క్యారెక్టర్‌లో రామ్‌ చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన కథ ఇది. పిరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.


ఇందులో ఓ విదేశీ భామ నటిస్తోంది. సినిమా ప్రారంభంలోనే హాలీవుడ్‌ హీరోయిన్‌ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తుందని ప్రకటించింది చిత్రబృందం. కానీ వ్యక్తిగత కారణాలు చూపుతూ జోన్స్‌ తప్పుకుంది. ఆ తర్వాత ఆ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై అనేక పేర్లు వినిపించాయి. తాజాగా అమెరికల్‌ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎంపికచేసినట్టు తెలిసింది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ ఎమ్మా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓ భారతీయ చిత్రంలో ఆమె నటించడం ఇదే ప్రధనం అంటున్నారు. ఇక రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com