ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతడి భార్య‌తో రొమాన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 11:43 AM



వివాదాల‌కు..గాసిప్స్‌కు దూరంగా ఉంటాడు న‌టుడు సూర్య‌. `కప్పాన్` ఆడియో ఈవెంట్ లో సూర్య అన్న ఓ మాట అభిమానుల్లో చర్చకొచ్చింది. ఈ వేదికపై తన కొలీగ్ అయిన హీరో ఆర్య గురించి ప్రస్థావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యను చేశారు. “ఈ సినిమాలో నాతో పాటు ఆర్య ఉన్నప్పటికీ .. తన భార్య సాయేషాతో రొమాన్స్ చేయాల్సి వ‌చ్చింది“ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యకు వేదికపై ఉన్న ఆర్య కూడా సరదాగానే నవ్వేశారట. ఇక ఈ సినిమాలో నటించేప్పుడే ఆర్య- సయేషా ఒకరితో ఒకరు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ప్రేమ ఫలించి పెద్దలు ఈ జంటను ఒకటిగా చేశారు. ఇకపోతే కప్పాన్ చిత్రంలోనూ ఈ జోడీ ప్రేమికులుగా నటించారు. ఆ ఇద్దరి నటనను సూర్య తెగ పొగిడేశారు. పనిలో పనిగా ఆర్య ఉన్నప్పటికీ నేను సయేషాతో జంటగా నటించానని కొంత బాధగా అనిపించినా సినిమా కాబట్టి తప్పలేదని సూర్య అన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com