రీమేక్ అంటే అచ్చం ఒరిజినల్ లా తీయాలి. కాకపోతే ఇక్కడ క్లైమాక్స్ కీలకం కానుంది. అప్పటివరకు ఒక టెంపో లో నడిచే కథలో చివరికి క్లైమాక్స్ వచ్చేసరికి హీరో కం విలన్ (ఇప్పుడు వరుణ్ చేసిన పాత్ర) ను ఫూల్ చేయిస్తాడు దర్శకుడు. తమిళ్ లో ఇది బాగా వర్క్ అవుట్ అయింది. ప్రేక్షకులు కూడా కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే అప్పటికి బాబీ సింహకు అది రెండో సినిమానే. కాబట్టి ఇమేజ్ లాంటి ప్రతిబంధకాలు ఏమి లేకపోవడంతో సాఫీగా బాక్స్ ఆఫీస్ హిట్టు కొట్టింది. కానీ ఇక్కడ వరుణ్ తేజ్ బాబీ సింహ పాత్ర చేస్తున్నాడు. తమిళంలో లానే తెలుగులో కూడా వరుణ్ పాత్ర ను ఫూల్ చేస్తారా? లేదా? అనేది తెలియాలి. ఒకవేళ ఫూల్ చేస్తే ఇక్కడ తెలుగు ప్రేక్షకులు యాక్సప్ట్ చేస్తారా ఎదో చూడాలి?