రెజీనా కాసండ్ర.. ఇటీవలే ఆమె నటించిన ఎవరు చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.అందాల భామ రెజీనా కాసండ్ర కూడా ఈ తరహా నటీమణుల జాబితాలో చేరింది. ఇందులో నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆమె చక్కటి నటనను కనబరిచినట్లు పేరొచ్చింది. దీనికి ముందు మరో తెలుగు చిత్రం 7లో కూడా ఆమె నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించింది. తాజాగా ఇంకోసారి ఆమె నెగటివ్ పాత్రలో కనపడనున్నట్లు వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన తమిళ హీరో విశాల్ నటించే నూతన చిత్రంలో రెజీనా అలాంటి పాత్ర చేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీనికి ఆనంద్ అనే నూతన దర్శ కుడు దర్శకత్వం వహిస్తారని చెప్పుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాలలో కూడా రాణించాలని రెజీనా ఎప్పట్నుంచో కోరుకుంటూనే ఉంది. అయితే కెరీర్ మలుపు అనుకున్నస్థాయిలో లేకపోవడం ఆమెను నిరాశకు గురిచేస్తోంది. అయితే ఆమె చేస్తున్న వైవిధ్యమైన పాత్రలు ఎలాంటి మలుపునిస్తాయో వేచిచూడాల్సిందే.