రవితేజ - వి.ఐ. ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం డిస్కో రాజా... పాయల్ రాజ్‌పుత్, నభానటేష్, తాన్యహోప్ కథానాయికలు. మంగళవారం నుంచి యూరప్‌లోని ఐస్లాండ్లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్లో హాలీవుడ్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7కు పనిచేసిన స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల కోసం దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఖర్చుచేయనున్నాం అని నిర్మాతలు తెలియజేసారు.