బాలీవుడ్ నటి కైరా అద్వాని ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోటోగ్రాఫర్లు కైరా ఫోటోలను క్లిక్కుమనిపించారు. బ్లాక్ ప్యాంట్.. నియాన్ గ్రీన్ టాప్ ధరించి.. ఆ టాప్ పైన బ్లాక్ ఇన్నర్ వేర్ ధరించింది. ఇదోరకం సూపర్ మ్యాన్ స్టైల్ అనుకోండి. పెద్ద సైజ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ తో స్టైలుకు నిర్వచనంలాగా కనిపించింది. తను ఇలా కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు పండగ చేసుకుంటారనే సంగతి తెలుసు కాబట్టి వారికి స్మైల్ ఇస్తూ పోజిలిస్తూ వయ్యారంగా నడుస్తూపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.