బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీప్తి సునైనా... తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూనే.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ యూత్‌తో టచ్ లో ఉంటుంది. దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అందులోభాగంగా ఫేస్ బుక్, ట్విట్టర్లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. హైదరాబాద్‌కి చెందిన ఈ 20 ఏళ్ల యూట్యూబ్ స్టార్ నగరంలో స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. కాగా ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు మోడలింగ్ చేస్తూ.. దాంతో పాటు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటో షూట్లు చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటూ సోషల్ మీడియాలను ఊపేస్తోంది. తాజాగా ఈ భామ వెకేషన్‌కు గోవా వెళ్లింది. అక్కడి బీచుల్లో తిరుగుతూ.. హాట్ పోజులతో కొన్ని పిక్స్‌ను, ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌ను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఫిదా అవ్వడమే కాదు.. సునైనా.. సూపర్ అంటూ తెగ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.