ట్రెండింగ్
Epaper    English    தமிழ்

90 ఎంఎల్ సినిమాను అడ్డుకుంటాం!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2019, 08:00 PM



కార్తికేయ తాజా చిత్రం 90ML సినిమాను అడ్డుకుంటామని మద్యపాన నిషేధం పోరాట సమితి సభ్యులు ప్రకటించారు. చిత్ర విడుదల సమయంలో ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని వెల్లడించారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన 90ML చిత్రం డిసెంబరు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పోరాట సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిత్రాల వల్లే యువత పెడదోవ పడుతోందని, మహిళలపై అఘాయిత్యాలకు కూడా ఇదే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం సినిమాలో మద్యం సేవించే సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాక చిత్ర పేరును కూడా మార్చాలి అని మద్యపాన నిషేధ పోరాట సమితి సభ్యులు తేల్చి చెప్పారు. హీరో కార్తికేయ సొంత బ్యానర్ అయిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రం రూపొందింది. శేఖర్ రెడ్డి ఏర్రా దర్శకత్వం వహించారు. సరస్వతి శుక్ల సమర్పణలో విడుదలవుతున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com