ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రెండ్ ను ఫాలో అవుతున్న సమంత !

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2019, 08:01 PM



అక్కినేని కోడలు సమంత ట్రెండ్ ను ఫాలో అవుతోంది. అందులో భాగంగానే సామ్ న్యూ టర్న్ తీసుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సమంత మరోవైపు ఫోకస్ చేస్తోంది. ఇంతకీ సామ్ కన్ఫార్మ్ చేసిందేమిటి? ఈ బ్యూటీ ఫాలో అవుతున్న ట్రెండ్ ఏంటో ఓ సారి చూద్దాం.. ! ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లితో ఈ చెన్నై బ్యూటీకి ఛాన్స్ లు తగ్గుతాయో అనుకుంటే అందుకు రివర్స్ లో సమంత దూసుకుపోతోంది. ఈ ఏడాది సమంత ఓ బేబీ, మజిలీ సినిమాలతో మరో రెండు సక్సెస్ లను ఖాతాలో వేసుకుంది. మజిలీ తర్వాత మరో సినిమాకు సైన్ చేయని సామ్ ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ప్రకటించింది. ఇటీవల వచ్చిన ది ఫ్యామిలీ మన్ అనే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ దాదాపు అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. దీంతో నెటిజన్లు సామ్ నటిస్తున్నది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణిలు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు రెండో సీజన్ లో సమంత నటించబోతుండటంతో ఈ వెబ్ సిరీస్ కు మరింత క్రేజ్ వస్తోంది. కొత్త సినిమాలేవి లేకపోవడంతో సామ్ వెబ్ సిరీస్ లపై దృష్టిపెడుతోంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. దీంతో సమంత లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com