నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్న నాని సెల్ఫీ

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:54 PM
 

అందమైన హీరొయిన్ ఒక్కరుంటేనే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. అలాంటిది నలుగురైదుగురు ఒకేచోట చేరి సెల్ఫీ కోసం ఫోజిస్తే ఇక ప్రత్యేకంగా చెప్పాలా . న్యాచురల్ స్టార్ నాని అలాంటి ఛాన్స్ కొట్టేసాడు. మొదటిసారి తాను ఎవరి భాగస్వామ్యం లేకుండా సోలోగా నిర్మిస్తున్న అ!! ఈ శుక్రవారమే విడుదల కానుంది. వెరైటీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ పోస్టర్స్ మొదలుకొని ట్రైలర్ దాకా మంచి ఆసక్తిని రేపింది. అన్నటికన్నా అసలు ఆకర్షణ ఇందులో టాలీవుడ్ లో పేరున్న హీరొయిన్లు భిన్నమైన పాత్రలు పోషించడం. కాజల్ - నిత్యా మీనన్ - రెజినా కసెండ్రా - ఈశా రెబ్బా కాంబోలో చాలా ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ డెబ్యుగా వస్తున్న ఈ మూవీలో చేపకు నాని - చెట్టుకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం


అ!! ప్రమోషన్ లో భాగంగా తన టీం బ్యూటీ స్ తో కలిసి నాని దిగిన సెల్ఫీ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అందరు ఒకే ఫ్రేంలో ఉండటం ఒక విశేషమైతే ఇలాంటి రేర్ కాంబో సెట్ చేసిన నిర్మాతగా నాని ఫేస్ కూడా ఆనందంతో వెలిగిపోతోంది. రెజినా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తుండగా నిత్య మీనన్ లెస్బియన్ గా షాక్ ఇచ్చే పాత్రలో కనిపిస్తుందని ఇప్పటికే టాక్ ఉంది. కెఫెటేరియాకు వచ్చి మాస్ మర్డర్స్ కు ప్లాన్ చేసిన అమ్మాయిగా కాజల్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఈశా రెబ్బా కూడా ఇప్పటిదాకా చేయని రోల్ చేసిందని టాక్. ఇలా అందమైన భామలకు సరికొత్త పాత్రలు ఆఫర్ చేసిన అ!! సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని నమ్ముతున్నాడు నాని.


 


ప్రియదర్శి - మురళీశర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ మనసుకు నచ్చిందితో పోటీ పడబోతోంది. 16న చెప్పుకోదగ్గ భారీ సినిమా ఏది లేకపోవడం అ!!కు ఖచ్చితంగా మేలు చేసేదే. ఇది హిట్ అయితే నాని మరికొన్ని సినిమాలు తన ఓన్ బ్యానర్ లో మొదలు పెట్టబోతున్నాడు. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ విడుదల కోసం ముస్తాబవుతోంది. 
Recent Post