స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా బుట్టబొమ్మ, రాములో రాములా, సామజవరగమన పాటలు రికార్డుల మీదా రికార్డులు సృష్టించాయి. ఇంకా సృష్టిస్తునే ఉన్నాయి . ముఖ్యంగా ఇందులోని బుట్టబొమ్మ పాట అయితే ప్రపంచ దేశాలను ఊపు ఉపేసింది.తాజాగా ఈ పాట 250 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డు నమోదు చేసింది.