ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటితోటలో ఈ అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా ..

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 14, 2020, 09:04 AM



ముంబై భామ సోనారిక భాడోరియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ భామ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. బుల్లితెరపై ప్రసారమైన ‘హరహర మహదేవ్’ సీరియల్లో పార్వతి పాత్ర పోషించి అందరినీ మెస్మరైజ్ చేసింది.  ఈ సీరియల్ చూసినవారంతా నిజంగా పార్వతిమాత ఇలానే ఉంటుందా? అన్నరీతిలో అద్భుతంగా నటించి మెప్పించారు. సోనారిక బుల్లితెరపై ట్రెడిషనల్ కన్పించినప్పటికీ ముంబై వాసనకు తగ్గట్టుగానే రియల్ లైఫ్ లో చాలా మాడ్రన్ గా ఉంటుంది. 


బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకున్న సోనారిక భాడోరియా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగులో ఈ భామకు మంచి క్రేజీ ఉండటంతో తెలుగు ఇండస్ట్రీ నుంచే సోనారికకు సినిమాల్లో తొలి అవకాశం దక్కింది. ‘జాదుగాడు’ మూవీ హీరోయిన్ గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. నాగశౌర్యకు జోడీగా సోనారిక భాడోరియా నటించింది. తొలి సినిమాలో గ్లామర్ షోతో అదరగొట్టే టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. 


జాదుగాడు తర్వాత స్పీడున్నోడు చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా సోనారిక భాడోరియా నటించింది. ఈ రెండు చిత్రాలు పర్వాలేదనిపించాయి. ఆ తర్వాత మంచి విష్ణు సరసన ఆడోరకం ఈడోరకం మూవీలో నటించింది. ఈ మూడు చిత్రాల్లోనే సోనారిక భాడోరియా తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఎందుకోగానీ ఈ మూవీ తర్వాత టాలీవుడ్లో ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. 


ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో సోనారిక భాడోరియా ఇంటికే పరిమితమైంది. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్ లను చేస్తూ అభిమానులను అలరిస్తుంది సోనారిక భాడోరియా. తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పింక్ ప్లవర్స్ కలిగి వైట్ డ్రెస్ వేసుకొని ఉన్న ఫొటోను షేర్ చేసింది. హాట్ హాట్ అందాలతో రోమాంటిక్ ఫోజులిచ్చి అభిమానులను అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. అరటితోటలో ఈ అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోనారిక భాడోరియా ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com