ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఆఫర్ కు పూనమ్ నో చెప్పిందట..

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 02, 2020, 11:24 AM



నార్త్ లో సూపర్ హిట్ అయినా బిగ్ బాస్ షో..సౌత్ లో కూడా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో నాల్గో షో మొదలుకానుంది. రీసెంట్ గా ఈ సీజన్ కు సంబందించిన కామింగ్ సూన్ ప్రోమో కూడా రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఇక ఈ సీజన్ 4కి నాగార్జున హోస్ట్‌ చేస్తున్నారు. బిగ్ బాస్ 4 లో పాల్గొనేది వీరే అంటూ సోషల్ మీడియాలో రోజుకో పుకారు వస్తుంది. ఇక తాజాగా ఈ షో నిర్వాహకులు టాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ పూనమ్ కౌర్ ను సంప్రదించారట. అయితే చాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన పూనమ్ వాటికంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది. అందువల్ల ఇటువంటి భామ తమ షోలో ఉంటె బాగుంటుంది అనుకున్నారట నిర్వాహకులు. అయితే ఈ ఆఫర్ కు పూనమ్ మాత్రం నో చెప్పినట్లు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com