నటుడు నవీన్ పొలిశెట్టి నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' 2019లో విడుదలై బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. కామెడీ థిల్లర్ గా విడుదలై తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్ లో కూడా విడుదల కానుంది. జపనీస్ భాషలో డబ్బింగ్ వెర్షన్ ను సెప్టెంబర్ 11న జపాన్ లో విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా హిందీ, తమిళ, మలయాళం రీమేక్ రైట్స్ కూడా అమ్ముడిపోయాయట. ఇటీవలే కాలంలో ఓ తెలుగు సినిమా ఇలా పలు భాషల్లోకి రైట్స్ దక్కించుకోవడం అరుదైన విషయం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని మూడు పార్టులుగా తీయనున్నారు. అంటే ఆ చిత్రానికి మరో రెండు భాగాలు రానున్నాయన్న మాట. డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. తను డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా పూర్తవగానే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది.