ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ 4: ఎంట్రీలోనే అదరగొట్టిన అవినాష్.. గంగవ్వకు అనారోగ్యం

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 11:16 AM



బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడంతా పులిహోర గోలే. అభిజిత్, సుజాత, లాస్యలకు తోడుగా హారిక చేరింది. ముగ్గురూ కలిసి సుజాతను ఇరికించే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ లో ఎవరైనా కనెక్షన్ పెట్టుకోవాల్సిందే అంటూ హారిక సుజాతను అంది. ఇన్ డైరెక్ట్ గా సుజాతను వేరే వాళ్ళతో లింక్ చేస్తూ మాట్లాడింది. దీంతో సుజాత నోయల్ దగ్గరకు చేరి నేనేమన్నా మీతో తప్పుగా ప్రవర్తిన్చానా అంటూ ప్రశ్నించింది. నోయల్ ఆమెకు సర్ది చెప్పాడు.
నేనో జోకర్ అంటూ జబర్దస్త్ ముక్కు అవినాష్ అదరగొట్టే ప్రోమోతో ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే అందరినీ ఆట పట్టించాడు. తనకున్న నవ్వించే లక్షణంతో మొత్తం హౌస్ లో ఉన్న వారందర్నీ తనవైపుకు యిట్టె తిప్పేసుకున్నాడు. చాలా సేపు అందరినీ తన మాటలతో నవ్వించాడు. మోనాల్ తో రకరకాలుగా మాట్లాడి ఆమెను నవ్వించాడు. ఇక అందరూ అవినాష్ ను ఆట పట్టించి.. ఆడ వేషం వేశేలా చేశారు. దానికి ఏమాత్రం జంకకుండా లేడీ గెటప్ వేసుకుని.. గంగావ్వతో కలిసి కాట్ వాక్ చేశాడు. గంగావ్వను హుషారు చేశాడు.
ఇక బీబీ టీవీ టాస్క్ లో భాగంగా అవినాష్ ఒక టీం, కుమార్ సాయి ఒక టీం గా కామెడీ స్కిట్ లు చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. కొంత మంది ప్రేక్షకులుగా ఉంది కమర్షియల్ యాడ్ లు చేయాలనీ సూచించాడు. అందరూ ఈ టాస్క్ ల కోసం రిహార్సల్స్ చేశారు.
బిగ్ బాస్ లో ఇప్పటివరకూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న గంగవ్వ ఆరోగ్యం అకస్మాత్తుగా ఇబ్బందికరంగా మారింది. జ్వరంతో ఇబ్బంది పడుతున్న గంగవ్వ ను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. అక్కడ గంగవ్వ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పాడు బిఘ్ బాస్. మీరు ఎంతో స్ట్రాంగ్ మీకేమీ కాదు గంగవ్వ అని ఆమెను అనునయించే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. అయితే, గంగవ్వ నాకిక్కడ బాలేదు. మట్టి మీద నడిచేదాన్ని ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటూ చెప్పింది. నన్ను పంపించేయండి అంటూ కోరింది. డాక్టర్లు ఆమె ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని బిగ్ బాస్ గంగవ్వకు చెప్పాడు. డాక్టర్ చూసిన తరువాత కూడా గంగవ్వ నేను ఉండలేను వెళ్ళిపోతాను అంటూ చెప్పింది. మరి ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న గంగవ్వ వేల్లిపోతుందా.. ఉంటుందా తేలాల్సి ఉంది.
ఇక ఈ ఎపిసోడ్ హైలైట్ మాత్రం జబర్దస్త్ ముక్కు అవినాష్. తన ఏవీ అందరినీ ఆకట్టుకుంది. చక్కని ఎడిటింగ్.. స్క్రిప్ట్ తో ఎవీని తీర్చిదిద్దారు. ఇక అవినాష్ జోకర్ లా ఇచ్చిన ఎంట్రీ అదిరింది. వచ్చిన దగ్గరనుంచీ అందర్నీ నవ్వించే పనిలో పడిపోయాడు అవినాష్. అనుకున్నట్టే వినోదాల డోస్ పెంచుతున్నాడు బిగ్ బాస్!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com