ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది అంటున్న అఖిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 19, 2020, 11:26 AM



అఖిల్ అక్కినేని హీరోగా రూపుదిద్దుకుంటోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సినిమా ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. ‘అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగు అలరిస్తోంది. ‘కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే... అయ్యయ్యయ్యయ్యో..’ అని చెబుతూ ఊగిపోయాడు.


కాగా, బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌,లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌ నిర్మాతలు. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వం వచ్చిన అనుమతులతో ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 25న ఉదయం 11.40 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com