సౌత్ లో గతంలో మంచి హీరోయిన్ గా వెలుగొందారు అనిత. అనిత ఇప్పుడు తల్లి కాబోతుంది. 2013లో రోహిత్ రెడ్డి ని అనిత వివాహం చేసుకుంది. అయితే వివాహం జరిగి ఏడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అనిత నుంచి ఎటువంటి శుభవార్త బయటకు రాలేదు.ఇక తాజాగా జరిగిన సీమాంతం ఫోటోలను అనిత పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. తనకు ఓ బేబీ పుట్టబోతున్నాడని ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది. తన కడుపులో బిడ్డ కుడివైపునకు ఎక్కువగా ఉందని ఈ ఫొటోల్లో చూడవచ్చు అని కూడా అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో నువ్వు నేనుతో పాటు పలు చిత్రాల్లో నటించింది.