హీరోయిన్ తాప్సీ ఓ హెల్త్ టిప్ ను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఓ సెల్ఫ్ మేడ్ ప్రొటీన్ డ్రింక్ ని తాప్సీ ట్రై చేశారు. దీన్ని తాను వాడటమే కాదు.. మీరు కూడా ఈ డ్రింక్ ను ట్రై చేయండి. పిల్స్ని వాడకండి అంటూ ఫ్యాన్స్ కి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. యాపిల్ సీడర్ వెనిగర్ తో మేథీ, పసుపు, అల్లం కలిపి తాగితే అలసి పోయిన మీరు వెంటనే రీచార్జ్ కావొచ్చని తాప్సీ అన్నారు.