అభిజిత్ ని నాగార్జున టార్గెట్ చేయడంపై అభి ఫ్యాన్స్ గరం అవుతున్నారు. అయితే, హోస్ట్ గా నాగార్జున కంటెస్టెంట్ల తప్పులను ఎత్తి చూపి వారిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ వారంలో ఎవరైతే దిద్దుకోలేని తప్పులు చేశారో, వాటినే ప్రస్తావిస్తూ ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోమని సలహా ఇచ్చారు. అది తమ మంచి కోరే చెప్పారన్న విషయం హారిక, అభిజిత్‌లకు అర్థమైంది కూడా. కానీ వాళ్ల అభిమానులే అనవసరంగా రెచ్చిపోయి నాగ్‌తో పెట్టుకుంటున్నారు. నోటికొచ్చినట్లుగా విమర్శిస్తున్నారు. కాగా రెండో సీజన్లో కౌశల్ మండా అభిమానులు హోస్ట్ నానిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక నాని మరోసారి బిగ్‌బాస్ షోనే చేయనని కరాఖండిగా చెప్పేశారు. ఈ సీజన్లో అభిజిత్ కోసం ఏకంగా నాగార్జుననే ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.