ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుదుటపడిన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 04, 2021, 01:46 PM



టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమా విడుదల త‌ర్వాత క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే. ఈ విష‌యాన్ని జ‌న‌సేన అఫీషియ‌ల్‌ గా ప్ర‌క‌టించింది. ఆయ‌న‌కు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అయ్యింది. ఇటీవ‌ల జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఊపిరితిత్తుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ ఉండ‌డంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అప్‌ డేట్ రాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా కుదుట‌ప‌డింద‌ని తెలుస్తుంది. క‌రోనా ప్రభావం త‌గ్గాక తిరిగి ఆయ‌న “హరిహర వీరమల్లు” "అయ్యప్పణం కోషియం" రీమేక్ సినిమాల్లో నటించ‌నున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com