ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రెజీనా కాసాండ్రా

cinema |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 10:24 AM



రెజీనా కాసాండ్రా.. ఈ ముద్దుగుమ్మ పేరు తెలుగులో ఆమధ్య బాగానే వినిపించింది. సుధీర్ బాబు నటించిన ‘శివ మనసులో శృతి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తిపుతెచ్చుకుంది. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. తెలుగులో వరుసగా సినిమాలు చేసినా సరైన హిట్ అందుకోలేక పోయింది. అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది పలు వైవిధ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ‘ఎవరు’ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో నటించి ఆకట్టుకుందీ చిన్నది. ఈ సినిమా విజయవంతమవడంలో కీలకపాత్ర పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే రెజీనా మరోసారి విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘చక్ర’ సినిమాలో ‘లీలా’ పాత్రలో నటించిన రెజీనా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఈ అమ్మడుకి అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. తాజా అప్ డేట్ ప్రకారం.. ఓకే క్రేజీ వెబ్ సిరీస్ కి రెజీనా ఎంపికైందని తెలుస్తుంది.


 


`రాకెట్ బోయ్స్` వెబ్ సిరీస్ లో కీలక పాత్రకు రెజీనా ఎంపికైంది. రాకెట్ బోయ్స్ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ ఉంది. ఇదో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన ఏపీజే అబ్దుల్ కలాం- విక్రమ్ సారాభాయ్- హోమీ బాబా లాంటి మేథావుల ఇతి వృత్తం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్ లో రాయ్ కపూర్ ఫిల్మ్స్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో రెజీనా భాగమవ్వడం లక్కీ అనే చెప్పాలి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com