శేఖర్ మాస్టర్‌ చనిపోయాడని చూపిస్తున్న గూగుల్...!

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 03:34 PM

శేఖర్ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్ 'ఢీ' డాన్స్ షో సీజన్ 7 నుంచి సీజన్ 13 వరకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం "శ్రీదేవి డ్రామా కంపెనీ" ఈ కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రాఫ్ ద్వారా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శేఖర్ మాస్టర్ అభిమానులకు గూగుల్ ఒక చేదు వార్తని చెప్పింది. గూగుల్ లో శేఖర్ మాస్టర్ అని టైప్ చేయగానే వెంటనే శేఖర్ మాస్టర్ ఫోటోతో పాటు అతని పుట్టిన తేదీ, అతను మరణించిన తేదీని చూపించడంతో శేఖర్ మాస్టర్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. గూగుల్ జూలై 8 2003 వ సంవత్సరంలో శేఖర్ మాస్టర్ చనిపోయినట్లు చూపించడంతో ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు గూగుల్ ఇలా చూపించడానికి కూడా ఒక కారణం ఉంది. తమిళం మలయాళం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా శేఖర్ నటించారు. అందరూ ఇతనిని మాస్టర్ శేఖర్ గా పిలుచుకునేవారు. మాస్టర్ శేఖర్ తెలుగులో "అక్కా తమ్ముడు" సినిమాలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తమ్ముడు పాత్రలో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటరైన మాస్టర్ శేఖర్ దాదాపు 50 సినిమాలకు పైగా నటించారు. ఈ క్రమంలోనే మాస్టర్ శేఖర్ జులై 8 2003వ సంవత్సరంలో మరణించారు. దీంతో గూగుల్ సెర్చ్ లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేయగానే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటో రావడంతో పాటు అతను మరణించిన తేదీని కూడా చూపించడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Recent Post