ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సూర్య' పుట్టినరోజు సందర్భంగా తాజా పోస్టర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 23, 2021, 12:10 PM



కోలీవుడ్లో కొత్తదనానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో సూర్య ఒకరు. ఈ రోజున ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రమైన 'ఎతరుక్కుమ్ తునింధవన్' నుంచి సెకండ్ లుక్ ను వదిలారు. ఈ సినిమా టీమ్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శత్రువులను ఖడ్గంతో అంతమొందించి, ఆ శవాల గుట్టల పక్కన ఆవేశంతో రగిలిపోతూ ఆయన కూర్చున్న ఈ పోస్టర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.


సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథనాలను తెరకెక్కించే దర్శకుడిగా ఆయనకి అక్కడ మంచి పేరు ఉంది. యథార్థ సంఘటనల నుంచి కథలను తీసుకోవడం .. సహజత్వంతో ఆ కథలను తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అలాంటి పాండిరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా చూసుకుంటే సూర్యకి ఇది 40వ సినిమా. ఇంతవరకూ సూర్య చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని అంటున్నారు. ఈ సినిమాలో సూర్య జోడీగా 'ప్రియాంక అరుళ్ మోహన్' అలరించనుంది. తెలుగులో 'నానీస్ గ్యాంగ్ లీడర్' .. 'శ్రీకారం' చేసిన ప్రియాంక అరుళ్ మోహన్, ఇప్పుడు తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ సినిమాతో అక్కడ ఆమె బిజీ కావడం ఖాయమని అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com