హైదరాబాద్ లో నేటి నుంచి 60 శాతం థియేటర్లు తెరచుకోనున్నాయి. మరో 3 వారాల్లోగా 100 శాతం థియేటర్లను తెరవనున్నారు. కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు నేటి నుంచి తెరచుకోనుండగా.. గురువారం థియేటర్లను శానిటైజ్ చేశారు. కరోనా నిబంధనలు, ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లను మాత్రమే నేటి నుంచి తెరవనున్నారు. కరోనా లాక్ డౌన్ తో గతేడాది మార్చి 14వ తేదీన థియేటర్లను మూసేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 4న థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో మే 1 నుంచి థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సినిమా హాళ్లను తెరిచేందుకు మళ్లీ అనుమతినిచ్చింది.