టాలీవుడ్ లో ఘనంగా 'రమ్యకృష్ణ' బర్త్ డే వేడుకలు..

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 04:50 PM

రమ్యకృష్ణ... 51 ఏళ్ల వయసు నిండినా వన్నె తగ్గని అందం ఆమెది. ఇప్పటికీ కూడా ఆమె ఛరిష్మాకు అభిమానులు ఫిదా అయిపోతారంటే అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్దాలు గడిచిపోతున్నా... ఇప్పటికీ మోస్ట్ డిమాండింగ్ ఫిమేల్ ఆర్టిస్టుల్లో ఆమె ఒకరు. నిన్న రమ్యకృష్ణ పుట్టినరోజు. తన బర్త్ డే వేడుకలను తన కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆమె ఘనంగా చేసుకున్నారు.


ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు ఖుష్బూ, రాధిక, మధుబాల, రెజీనా, త్రిషలతో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. సినిమాల విషయానికి వస్తే రమ్యకృష్ణకు చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. రిపబ్లిక్, రొమాంటిక్, లైగర్, రవి బొపన్న చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు.
Recent Post