కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా తన అందచందాలతో అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూ, మరోవైపు ఫొటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. రీసెంట్ గా పింక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా కనిపించిన కాజల్ అగర్వాల్ తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది.మైండ్ బ్లోయింగ్ లుక్ లో కనిపించిన కాజల్ అగర్వాల్ ని చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.పెళ్లి తర్వాత కాజల్ అందం రెట్టింపు అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల కాజల్ తల్లి కాబోతుందంటూ అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. పుకార్లకి చెక్ పెట్టేందుకే కాజల్ ఇలా వెరైటీ ఫోటో షూట్స్ చేస్తుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది.