శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన "లవ్ స్టోరీ" సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. డాన్స్ లు కూడా బాగా చేశారు. శేఖర్ కమ్ముల కులాల సబ్జెక్టుతో కథ రాసుకుని దానిని చక్కగా డీల్ చేశారు. సినిమాలోని సున్నితమైన డైలాగులు ఆకట్టుకుంటాయి. రేవంత్, మౌనిక పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి బాగా చేశారు. సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం, చిత్రీకరణ సినిమాను అదనపు బలాలుగా నిలిచాయి. అక్కడక్కడ స్టోరీ స్లో గా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కడా బోర్ కొట్టదు.