మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం “అఖండ”. మాస్ ఆడియెన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ ఈ ఏడాది దీపావళి కానుకగా వస్తుందని టాక్ గత కొన్ని రోజులు నుంచి వినిపిస్తుండగా ఇప్పుడు దానిపై క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వరకు ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ సింగిల్ మాత్రమే వచ్చింది ఎప్పుడో కొన్ని అప్డేట్స్ వచ్చాయి. కానీ మళ్ళీ రీసెంట్ గా వేరే అప్డేట్స్ రాలేదు. పైగా ఇప్పుడు కేవలం ఇంకొక అర్ధ నెల మాత్రమే సమయం ఉండడంతో ఈ చిత్రం ఇప్పుడు దీపావళి కానుకగా అయినా వస్తుందా రాదా అన్న డౌట్స్ మొదలవుతున్నాయి.