తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాను ఫాలో అయ్యే సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మాళవిక మోహనన్ . ఈ భామ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలతో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. మాళవిక మోహనన్ నెట్టింట్లో ఫొటోలు పెట్టిందంటే చాలు వాటికి లైక్స్ మీద లైక్స్ వరదలా వచ్చేస్తుంటాయి. ఈ భామ తాజాగా అందాలు ఒలకపోస్తూ హాట్‌హాట్ లుక్ లో కెమెరాకు ఫోజులిచ్చింది.లేత ఎరుపు రంగు షార్ట్ డ్రెస్‌లో జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో..ముగ్ద మనోహరమైన సౌందర్యంతో హొయలు పోతుంది. చిరుమందహాసంతో చిలిపిగా నవ్వుతూ మాళవిక మోహనన్ దిగిన ఫొటోలు నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. గతేడాది మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మాళవిక.