ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సలార్‌' యాక్షన్‌ సీన్‌ వీడియో లీక్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 19, 2021, 05:42 PM



యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాలను చేస్తూ పుల్ బిజీగా ఉన్నాడు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌లార్' చిత్రంలో ఆయ‌న న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అయితే.. ఈ చిత్రానికి లీక్‌ల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ గెట‌ప్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ కాగా.. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యాక్ష‌న్ స‌న్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో అది.ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్ ప‌ట్టుకుని కాలుస్తున్నాడు. వీడియో నిడిచి చాలా త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి.. ప్ర‌భాస్ ఈ చిత్రంలో ఎలా ఉండ‌బోతున్నాడు అనేది అర్థం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్ పుట్టిన రోజుకు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతుండ‌గా.. ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ న‌టుడు విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


 


 


 


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com