ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రొమాంటిక్‌' ట్రైలర్‌.. రిలీజ్ చేసిన ప్రభాస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 19, 2021, 05:49 PM



డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అనంతరం హీరోగా సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాడూరి దర్శకుడు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్‌ పూరినే అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టకోగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశాడు.'ఐ లైక్ దిస్ ఎనిమల్' అంటూ ఆకాశ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయిన ఈ ట్రైలర్‌ ఎంతో రొమాంటిక్‌గా సాగింది. ఎంతోకాలంగా మంచి హిట్‌ కోసం చూస్తున్న ఈ కుర్ర హీరో ఎలాగైనా సక్సెస్‌ రుచి చూడాలని కసిగా ఈ సినిమాతో చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర​మ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీత అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్‌ 29న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com