రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం అతిథులకు చేసే మర్యాదల గురించి ఇండస్ట్రీలో ఎవరినడిగినా చెప్తారు.కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి కూడా పెదనాన్న నుండి ఈ అలవాట్లు అబ్బాయి.ఇప్పటికే చాలామంది సినిమావాళ్లు డార్లింగ్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఇంటికి వచ్చే అతిథులనే అంత బాగా చూసుకుంటే ఇక ఇంట్లో పనిచేసే వాళ్లని ఎలా చూసుకుంటారో చెప్పక్కర్లేదు. సొంత మనిషిలా చూసుకుంటారు.కృష్ణంరాజు ఇంట్లో పాతికేళ్లుగా పద్మ అనే ఆవిడ పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా తమ బాగోగులు చూసుకుంటూ నమ్మకంగా ఉన్న పద్మ తమ వద్ద పని చెయ్యడం మొదలు పెట్టి పాతిక సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు.25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించి కృతజ్ఞతలు తెలిపారు కృష్ణంరాజు దంపతులు. పద్మ వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, పద్మకు గోల్డ్ ఛైన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.