వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ స్పై థ్రిల్లర్ “ది ఘోస్ట్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున , కాజల్ రా ఏజెంట్స్ గా నటిస్తున్నారు. హీరో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్లో కనిపించనున్నారు.హీరో నాగార్జున బర్త్ డే సందర్భంగా “ది ఘోస్ట్” అనే టైటిల్‌తో పాటు మూవీలోని ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగార్జున నల్లటి కోటు ధరించి చేతిలో కరవాలంతో శక్తివంతంగా కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న “ది ఘోస్ట్ “మూవీ లో అఖిల్ అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని నిమిషాల పాత్రే అయినప్పటికీ కథకు చాలా ఇంపార్టెంట్ రోల్ అని సమాచారం.