హీరో నాగ చైతన్యకు సంబంధించిన ఫొటోలను హీరోయిన్ సమంత తన సామాజిక మాధ్యమాల నుంచి డిలీట్ చేస్తోంది. సమంత-నాగ చైతన్య వివాహ బంధానికి అక్టోబర్ 2న తెరపడింది ఈ క్రమంలో పాత జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి సమంత ప్రయత్నిస్తోంది. చైతూతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు సమంత ఆయనకు సంబంధించిన దాదాపు 80 ఫొటోలను తన ఇన్స్టా నుంచి డిలీట్ చేసింది.ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఉన్న ఫొటోలను మాత్రమే ఉంచి, చైతూతో దిగిన ఫొటోలను మాత్రం ఆమె తొలగించేస్తోంది.