అక్కినేని హీరో సుమంత్ రణ్వీర్ సింగ్ క్రికెట్ ఎపిక్ '83'కి డబ్బింగ్ చెప్పనున్నాడు. లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మంగళవారం సాయంత్రం, సుమంత్ తన ట్విట్టర్లో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా ఈ విషయాన్ని తెలిపారు, "తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చేయడం ద్వారా ఇందులో చిన్న భాగం అయినందుకు సంతోషంగా ఉంది అని తెలిపాడు. ఈ సినిమాలో సుమంత్ రణవీర్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. '83' సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో రానుంది. ఈ సినిమాలో అమ్మీ విర్క్, సాహిల్ ఖట్టర్, చిరాగ్ పాటిల్, తాహిర్ రాజ్ భాసిన్, జతిన్ సర్నా, మరియు నిషాంత్ దహియా నటించారు.