ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణవీర్ సింగ్ '83' మూవీకి డబ్బింగ్ చెప్పనున్న అక్కినేని హీరో

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 09:05 PM



అక్కినేని  హీరో సుమంత్‌ రణ్‌వీర్‌ సింగ్‌ క్రికెట్‌ ఎపిక్‌ '83'కి డబ్బింగ్‌ చెప్పనున్నాడు.  లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ  సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మంగళవారం సాయంత్రం, సుమంత్ తన ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా ఈ  విషయాన్ని తెలిపారు, "తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చేయడం ద్వారా ఇందులో చిన్న భాగం అయినందుకు సంతోషంగా ఉంది అని తెలిపాడు. ఈ సినిమాలో సుమంత్‌ రణవీర్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పనున్నాడు. '83' సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో రానుంది.  ఈ  సినిమాలో  అమ్మీ విర్క్, సాహిల్ ఖట్టర్, చిరాగ్ పాటిల్, తాహిర్ రాజ్ భాసిన్, జతిన్ సర్నా, మరియు నిషాంత్ దహియా నటించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com