ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమన్నాకు గోల్డెన్ ఛాన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 10:23 AM



విశ్వ నటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఇండియన్ 2 ( భారతీయుడు 2). 1996లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టందుకుంది.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై సంచలన విజయం అందుకుంది. కమల్-శంకర్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అనిపించుకుంది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్నది 'ఇండియన్ 2'. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ఈ ప్రాజెక్టులోకి కొత్తగా వచ్చి చేరింది మిల్కీ బ్యూటీ తమన్నా. అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కదా మిల్కీ బ్యూటీ మరో హీరోయినా అని అడగొద్దు. ఎందుకంటే చందమామని మిల్కీ రీప్లేస్ చేసింది .అసలేం జరిగిందంటే... ఈ సినిమా ప్రారంభమైనప్పటి నంచీ ఇందలో వర్క్ చేస్తున్న టీమ్ లో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. కీలక పాత్రలో నటించిన నెడిముడి వేణు అనారోగ్యంతో చనిపోగా, ఆ తర్వాత వివేక్ హార్ట్ ఎటాక్ తో కన్ను మూశాడు. ఇక ఆ మధ్య ఫ్లోర్లో క్రేన్ల మధ్య షూటింగ్ చేస్తుండగా క్రేన్ కూలి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి చెందిన వారు మృతిచెందారు. దీంతో ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనున్న మూవీ విషయంలో వరుస అవాంతరాలు మూవీటీమ్ ని మాత్రమే కాదు అభిమానుల్ని కలవరపెడుతున్నాయి. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది కాజల్. దీంతో మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టిన దర్శకుడు శంకర్ తమన్నాని ఫైనల్ చేసినట్టు టాక్. కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ గోల్డెన్ ఛాన్స్ తమన్నాకు దక్కింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com