జి5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్' స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఆ హిట్ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా మేకర్స్ లూజర్ 2ని రూపొందించారు. అయితే ఈ రెండో సీజన్‌కు అభిలాష్ రెడ్డితో కలిసి శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. 'లూజర్ 2' సిరీస్ జనవరి 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.