దొరక్క దొరికిన హీరోయిన్స్ ని నెటిజన్స్ అస్సలు వదిలిపెట్టరు. పర్సనల్ ప్రశ్నలను సంధిస్తారు. మరికొందరు శృతి మించి బాడీ పార్టులపై కూడా క్వశన్ చేస్తారు. తాజాగా శృతి హాసన్ కు ఇలాంటి ప్రశ్నే ఒకటి ఎదురైంది. 'మీ బాడీలో ఏ పార్టులంటే ఇష్టం' అంటూ ఓ నెటిజన్ అడిగేశాడు. ఒకింతకు షాక్ కి గురైన
శృతి.. చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. 'నా బాడీలో నాకు నచినవి చాలానే ఉన్నాయి. అన్నింటికంటే నాకు నా బ్రెయిన్ అంటే ఇష్టం. ఆ తర్వాత నా హార్ట్ అంటే ఇష్టం. ఆ రెండు అంటేనే ఇష్టం' అంటూ ఆన్సర్ ఇచ్చింది. స్మార్ట్ సమాధానంతో తెలివికల్ల పిల్ల అనిపించుకుంది. ప్రస్తుతం శృతి ప్రభాస్ 'సలార్'తో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు ప్రియుడు శాంతను హజారికాతో విలువైన సమయాన్ని గడుపుతుంది.