అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రం 202 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సంక్రాంతికి బంగ్రాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. బంగార్రాజుతో పాటు విడుదలైన కొన్ని సినిమాలు పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “బంగార్రాజు” పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. నాగ చైతన్య, నాగార్జున మరోసారి వెండితెరపై సందడి చేయడంతో ప్రేక్షకులు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సంక్రాంతి బరిలో బంగార్రాజు తప్ప మరే పెద్ద చిత్రం లేకపోవడంతో రెండో వారం కూడా స్ట్రాంగ్హోల్డ్లో ఉంది.