ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో రీమేక్ సినిమాల్లో అదే హీరోయిన్ నటిస్తుంటుంది. డేట్స్ సర్దుబాటు కాకుంటే మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తారు. తెలుగులో మంచి విజయం సాధించిన 100 లవ్ చిత్రాన్ని తమింలో రీమేక్ చేస్తున్నారు. నాగచైతన్య, తమన్నా నటించిన పాత్రల్లో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, షాలిని పాండే (అర్జున్ రెడ్డి ఫేమ్) నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేశారు. తమిళ చిత్రానికి చంద్రమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా తెలుగు, తమిళ చిత్రాల నటి. ఆమెకు కోలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది.
అయినప్పటికీ తమన్నా చేసిన పాత్రకి షాలిని పాండేను ఎంపికచేయడం విశేషం. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ తమన్నాలో ఉత్తరాది ఛాయలు కనిపిస్తాయి. మా సినిమాలో పక్కింటి అమ్మాయిగా కనిపించాలి. అందుకే షాలిని ఎంపికచేసినట్టు తెలిపారు. పైగా ఈ సినిమా కథను తమిళ నేటివిటికి అనుగుణంగా మార్పులు కూడా చేసినట్టు ఆయన చెప్పారు. తమన్నా ఇప్పటికే అనేక తమిళ చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెలో ఉత్తరాది ఛాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తన సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అనేది దర్శకుడి స్వేచ్ఛ ఉంటుంది.