ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిట్ నెస్ తో రెస్ట్ లేని లస్ట్ భామ

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 21, 2018, 09:23 AM



గ్లామర్ ఇండస్ట్రీ లో ఉండాల్సింది ఫిగర్.. ఫిట్ నెస్.  ముఖ్యంగా హీరోయిన్లకు ఇది చాలా ముఖ్యం. అంటే...  అతి ముఖ్యం..!  అర్థం అయిందిగా అంత ఇంపార్టెంట్! మరేం లేకపోయినా పర్వాలేదు. యాక్టింగ్.. మరోటి.. ఇంకోటి అన్నీ బోనస్ లే తప్ప అర్హతలు మాత్రం కావు.  మరి కియారా అద్వాని కి గ్లామర్ ఉంది.. గ్లామర్ తోపాటు యాక్టింగ్ కూడా ఉంది. ఎంత యాక్టింగ్ అంటే 'భరత్ అనే నేను' అమాయకంగా.. 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ లో స్వీయ భావప్రాప్తి పొందుతూ ఇలా పూర్తిగా విరుద్దమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఔరా..  అనిపించగలిగిన నటన కూడా ఆమె సొంతం.


ఇక ఆమె ఫిట్ నెస్ గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. జిమ్ లో బిగుతు దుస్తుల్లో కసరత్తులు చేస్తూ ఆ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నెటిజనులపై తన కక్ష తీర్చుకోవడం కీయారాకు ఉన్న చాలా హాబీలలో ఒకటి.  ఇప్పటికే యూత్ లో ఫిట్ నెస్ ఐకాన్ గా గుర్తింపు సాధించడంతో ఒక ఫేమస్ ఫిట్ నెస్ బ్రాండ్ కు అంబాజిడర్ గా అవకాశం దక్కించుకుంది.  ఇదిలా ఉంటే..  అక్టోబర్ ఫస్ట్ వీక్ లో జరగనున్న ఒక 'వాకథాన్' (మారథాన్ లాగా నడక కార్యక్రమం) లో కూడా పాల్గొంటుందట.    


సినిమాలు.. షూటింగ్ లు ఉండి కూడా రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్ గా ఉండాలంటే ఎంతో శ్రద్ధ అవసరం.  పైగా తను నెక్స్ట్ సినిమాలో స్టంట్స్ కూడా చేస్తుందట. మరి మీరు ఫాలో అవుతారా? లేదా..కియారా నీకో దండం నీ ఫిట్నెస్ కు.. ఫ్లెక్సిబిలిటీ కి ఓ దండం అని డైలాగ్ చెప్పి ఊరుకుంటారా?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com