క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన నోటా ప్లాప్ అయినా నిరాశచెందకుండా విలక్షణమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకుసాగుతున్నాడు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న మూవీ టాక్సీ వాలా.. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ.. ఈ మూవీ తర్వాత కాంత్రి మాధవ్ తో రొమాంటిక్ మూవీని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్ పై కె ఎస్ రామారావు నిర్మించనున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్.. ఇప్పటికే రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్ లతో పాటు బ్రెజిలీయన్ హాట్ మోడల్ ఇజాబెల్ లియోట్ లను హీరోయిన్స్ గా ఫిక్స్ చేశారు.. విజయ్ మూవీలో తొలిసారిగా ఒక విదేశీ భామ నటించనుంది.. బ్రెజిల్ కు చెందిన ఇజా బెల్ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాలు. 2013లో 16 మూవీతో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత 2014లో పూరానీ జీన్స్ లో నటించింది.. నాలుగేళ్ల విరామం అనంతరం జయంతీ పరాంజీ మూవీ నరేంద్ర మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకూ పూర్తి కాలేదు.. ఈ మూవీ కోసం హైదరాబాద్ లో ఉంటున్న ఆమెకు అనుకోకుండా విజయ్ దేవరకొండ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది..ఈ మూవీకి దసరా రోజున లాంచనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించను న్నారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ కు వెళ్లనుందీ మూవీ.. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి కె ఎస్ వల్లబ్ నిర్మాత.