అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా, రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "ప్రేమ కాదంట". గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. నవంబర్ నాల్గవ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుందని త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట. విశేషమేంటంటే, ఈ మూవీ విడుదలవుతున్న రోజునే, సమంత "శాకుంతలం" పాన్ ఇండియా మూవీ కూడా విడుదల కాబోతుంది.
పోతే, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.