ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) ఆదివారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కామెడీ సినిమాల ద్వారా మాలీవుడ్ లో ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. 'వర్ణం' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. 'ఆచార్యన్' సినిమాతో పాపులరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆయనకు గల్ఫ్, కొచ్చిలో ఐటీ కంపెనీలున్నాయి. భార్య, కుమార్తె ఉన్నారు